Art: Mandira Bhaduri |
1
ఆకాశంలోకి ఎగురుతూ విమానం
పాటలోకి ఎగురుతూ నేను.
2
నను ఇంత దగ్గరగా చూసి
విస్తుపోయిన మేఘాలు
3
ఆకాశంలో ఒకడే చంద్రుదు
సముద్రం మీద వేల లక్షల
చంద్రుళ్ళు
4
వీధి దీపాల్ని మెళ్ళొ
వేసుకొని
మాయద్వీపంలా వెలుగుతూ
నగరం
తళుకులీనుతూ పైన పాలపుంత
మధ్యలొ తేలుతూ నేను
5
ఉచితంగా నాతో
ఫ్రయాణిస్తున్న ఒక సాలీడు
6
మహా నగరాన్ని
నిమిషంలో దాటిన విమానం
నా కలల్ని దాటి కూడా
పోగలదా?
7
వర్షంలోంచి
వర్షంలోకి
కప్పలా దూకిన విమానం
- ఆకెళ్ళ రవిప్రకాష్
JULY 27, 2016
Follow : https://www.facebook.com/akellaraviprakash/
Follow : https://www.facebook.com/akellaraviprakash/
No comments:
Post a Comment