Sunday, August 27, 2017
Saturday, August 26, 2017
అంతర్జాతీయ ఫోటో ప్రదర్శన
విశాఖలో అంతర్జాతీయ ఫోటో ప్రదర్శన సందర్శించడం గొప్ప అనుభూతి కలిగించింది. 330 మంది ఫోటోగ్రాఫర్ల ..35 వేల చిత్రాలు ప్రదర్శనలో ఉంచారు. తడిమి చూస్తే ప్రతీ చిత్రానిదీ ఒక్కో నేపధ్యం..ఈ ప్రదర్శన విశాఖలో జరగడం అదృష్టం..ఈ రోజు అతిధిగా హాజరైన నాకు హవా మహల్ చిత్రపటాన్ని ..చిత్రించిన చిత్రకారుడు నరేష్ మహంత చేతుల మీద అందుకోవడం ..నిజంగా మధురానుభూతిని మిగిల్చింది 🙏

Monday, August 7, 2017
Sunday, August 6, 2017
Tuesday, August 1, 2017
కవిత్వం - దుఃఖం తర్వాత - ఆకెళ్ళ రవి ప్రకాష్
దుఃఖం గట్టిగా నీ ఇంటి తలుపు కొట్టే
సమయం ఆసన్నమైంది.
తలుపు తెరచి నిన్ను నువ్వే
లోపలికి ఆహ్వానిస్తావు.
కుశల ప్రశ్నలు అయ్యాక
ఇద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు
మాట్లాడుకుంటారు
ఇప్పటిదాకా అపరిచితంగా మెలిగిన
నీ ముందు నువ్వే
నీ లోపలి గాయాల్ని
అన్నిటినీ విప్పుకుంటావు.
నీ జీవితాంతం
ఎవరు నువ్వు కాదు అని
తప్పించుకు తిరిగావో
అది ఎవరో కాదు నువ్వే
అని తెలుసుకున్న యీ రోజు
నువు రాసుకున్న ఉత్తరాలు
సమస్త కవిత్వం
గీసిన బొమ్మలు
తీసిన చిత్రాలు
అన్నిటితో సహా
అద్దంలోంచి నీ బొమ్మ
చిరిగిపోయినపుడు
ఇవాళ
కూర్చుని దర్శించు
జీవితాన్ని మళ్ళీ కొత్తగా…
- ఆకెళ్ళ రవి ప్రకాష్
( వాకిలి సాహిత్య పత్రిక 02 - 08 - 2017 )
Subscribe to:
Posts (Atom)